29, జనవరి 2017, ఆదివారం

నేను 4వ తరగతిలో ఉండగా (1948వ సంవత్సరములో)  చదువుకున్న పద్యములు
1.  ఆటవెలది ఛందస్సు
ఆఢ్యుడున్నయప్పుడందరు  పూజ్యులే
లెక్కమీద సున్నలెక్కినట్లు  |
అతడు పోయినప్పుడందరపూజ్యులే
లెక్కలేక సున్నలేగినట్లు ||

2. కందపద్యము
చేతనగువాడు తనపని
కై తగ్గును వంగుగాక యల్పుండగునే? |
ఏతము చడి తా వంగును
పాతాళము నీరుదెచ్చి బయలంజల్లున్ ||