1, జులై 2018, ఆదివారం

स्वरचितानि पद्यानि ।
मञ्जर्या इव ते वाग्भ्य:, मथु स्रवति सुन्दरि!  अतस्त्वं गुरुणा शब्द-, मञ्जर्या बहुमानिता ।।   ( हे प्रिये ! )
डाम्बिको(अ)यं नरो नूनं, ग्रामसिंह: सुनिश्चित: ।  यतो भषति पश्चाद्धि, सम्मुखे तु पलायते  ।।
రామ ! రామ ! జయ రాజారామ !,  రావణసంహర ! రణభీమ ! ‌
రఘుకులసోమ ! జానకిరామ !,  కావుము దయతో మమ్ము సదా ‌‌‌‌||

29, జనవరి 2017, ఆదివారం

నేను 4వ తరగతిలో ఉండగా (1948వ సంవత్సరములో)  చదువుకున్న పద్యములు
1.  ఆటవెలది ఛందస్సు
ఆఢ్యుడున్నయప్పుడందరు  పూజ్యులే
లెక్కమీద సున్నలెక్కినట్లు  |
అతడు పోయినప్పుడందరపూజ్యులే
లెక్కలేక సున్నలేగినట్లు ||

2. కందపద్యము
చేతనగువాడు తనపని
కై తగ్గును వంగుగాక యల్పుండగునే? |
ఏతము చడి తా వంగును
పాతాళము నీరుదెచ్చి బయలంజల్లున్ ||


2, ఫిబ్రవరి 2016, మంగళవారం

నిజామ్ నవాబ్ అగు ముల్క్ ఇబ్రహీమ్ కవి పణ్డిత పోషకుడై ఉండెను. తెలుగులో అతనిని మల్కిభరాముడని  పిలిచేవారు. ఒక రోజు అతడు తన ఆస్థానకవికి ఈ క్రింది సమస్య ఇచ్చి పూరించమనెను. " నాలుగు కుండలుండవలె. నా పేరుండవలె. అటువంటి పద్యమును చెప్పుము." అప్పుడా కవి ఆశువుగా ఈ క్రింది పద్యమును చెప్పెను.
ఆకుండ కల్పవృక్షమ!
ఈకుండగ లోభివగుదు-విహపరములకున్ |
నీకుండగ మాకిచ్చుట
మాకుండగనడుగవలదు-మల్కిభరామా! ||
ఈ పద్యము ఆది-అనుప్రాసకు ( beginning rhyme ) చక్కని ఉదాహరణము.
ఆది శంకరాచార్యులవారు తమ భజగోవిందస్తోత్రములొ ఆది-అనుప్రాస కలిగిన ఈ క్రింది పద్యమును చెప్పియున్నారు.
గేయం గీతానామసహస్రం, ధ్యేయం శ్రీపతిరూపమజస్రం | నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీనజనాయ తు విత్తమ్ ||
సంస్కృతసాహిత్యములో ఆదిశంకరాచార్యులవారే అంబాష్టకమను మరియొక స్తొత్రములో అన్ని పద్యములలోను ఈ ఆది-అనుప్రాసను పాటించియున్నారు.  ఉదాహరణకు అందులోని మొదటి  పద్యమును ఇచ్చుచున్నాను.  ఈ స్తోత్రమును  కాళిదాసకృతకాళికాదశశ్లోకీ అని కొంతమంది పిలిచెదరు.
చేటీభవన్నిఖిలఖేటీ కదంబతరువాటీషు నాకిపటలీ-,
కోటీరచారుతరకొటీమణీకిరణకోటీకరంబితపదా |
పాటీరగంధికుచశాటీ కవిత్వపరిపాటీమగాధిపసుతా,
ఘోటీకులాదధికధాటీముదారముఖవీటీరసేన తనుతామ్ ||

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

सहेतुकदयावन्तः सर्वेऽन्ये त्वां विना भुवि । 
निर्हेतुकदयावत्त्वं केवलं त्वयि वर्तते ॥
(निर्हेतुकदयावांस्त्वं भगवन्! प्रतिभासि मे ॥)

24, సెప్టెంబర్ 2015, గురువారం

యుక్తం త్వం విజయే! శబ్ద-, మఞ్జర్యా బహుమానితా | మఞ్జర్య ఇవ శబ్దాస్తే కర్ణే మధు స్రవంతి హి ||

21, సెప్టెంబర్ 2015, సోమవారం

నేను వ్రాసిన పద్యములు

ప్రాతఃకాలే తు గాయత్రీ సాయంకాలే సరస్వతీ | మధ్యాహ్నకాలే సావిత్రీ రాత్రౌ కాళీతి సోచ్యతే ||
సూర్యోదయే తు గాయత్రీ సూర్యాస్తే తు సరస్వతీ | మధ్యాహ్నే సైవ సావిత్రీ నిశీథే కాళికా స్మృతా ||  ( సార్ధరాత్రే తు కాళికా || )
హరిరేవ గురుర్హరిమేవ భజే, హరిణైవ సహాస్మి నమో హరయే | న హరేః పరమం శిశురస్మి హరేః, జగదస్తి గురౌ మాం పాహి గురో ||
గురురేవ గతిర్ గురుమేవ భజే, గురుణైవ సహాస్మి నమో గురవే | న గురోః పరమం శిశురస్మి గురోః, దేవోస్తి గురౌ మాం పాహి గురో ||

10, సెప్టెంబర్ 2015, గురువారం

mahalakShmi namaste&stu praseeda varadaa bhava |
siddheernidheeraShTa nava dehi me parameSwari! ||
महालक्ष्मि! नमस्तेऽस्तु प्रसीद वरदा भव ।
सिद्धीर्निधीरष्ट नव देहि मे परमेश्वरि! ॥